అందరిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో మలబద్ధకం కూడా ఒకటి. అల అని ఇది పెద్ద సమస్య కాదు కానీ, ఆ ఏం కాదులే అని వదిలేసేంత చిన్న సమస్య కూడా కాదు. మరీ ముఖ్యంగా రోజువారీ విషయాలు ఒక క్రమపద్ధతిలో జరగకుండా ఈ సమస్య అడ్డం పడుతూ ఉంటుంది. ఈ సమస్యకి మందులు ఉన్నాయి. కానీ అవి లైఫ్‌లాంగ్ వేసుకుంటూనే ఉండాలి. వాటి కంటే కూడా కొన్ని చిట్కాలు పాటిస్తే చాలా మందికి చాలా వరకు ఈ సమస్య నేచురల్‌గా నయమవుతుంది. దీంతో మెడిసిన్ కూడా వాడాల్సిన అవసరం లేదు. దీనికోసం కొన్ని ఇంటి చిట్కాలతో పాటు రోజువారీ ఫాలో అయ్యే కొన్ని జాగ్రత్తల గురించి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యంమల బద్ధకం ఎందుకు వస్తుందంటే నీరు సరిగ్గా తాగకపోవడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, ఫైబర్ ఉన్న ఫుడ్స్ అసలు తీసుకోకుండా ఉండడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం లాంటివి. మీకు ఇదే సమస్య ఉండి ఈ కారణాలు మీకు కూడా వర్తించేట్లైతే ముందు వాటిని సరి చేసుకుని చూడండి. అలాగే ఇక్కడ ఇచ్చిన కొన్ని టిప్స్ కూడా చాలా వరకు హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా కొన్ని ఫుడ్స్‌ని మీ డైట్‌లో యాడ్ చేయాలి.
· ప్రూన్స్ప్రూన్స్ అంటే ఎండిన ప్లమ్ పండ్లు. వీటిని రెండు మూడు పండ్లు తీసుకుని గోరు వెచ్చని నీటిలో రాత్రంతా నానబెట్టి పొద్దున్న ఆ నీటిని తాగేసి నానిన ఆ పండ్లు తినండి.
· ఆలివ్ ఆయిల్ పరిగడుపునే ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకోవచ్చు. ఫ్లేవర్ కాస్త ఘాటుగా ఉందంటే కాసింత నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.
· అవిసె గింజలుఈ గింజల్ని నానబెట్టి, పొడి చేసి, ఉడకబెట్టి.. ఎలా తీసుకున్నా మంచిదే. ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ కూడా హెల్ప్ చేస్తుంది.
మల బద్ధకం ఉంటె ఎలా తగ్గించుకోవాలి.
- మజ్జిగ, ప్రోబయాటిక్ కర్డ్ మాత్రం ఈ సమస్య రాకుండా నివారిస్తాయి.
- గ్రుడ్లల్లో ప్రొటీన్ ఎక్కువే ఉంటుంది కానీ, ఫైబర్ చాలా తక్కువ. ఎగ్స్ పూర్తిగా మానేయక్కర్లేదు కానీ పాలకూర వంటి ఆకుకూరలతో ఆమ్లెట్స్ వేసుకుని ఎంజాయ్ చేయొచ్చు.
- ఒత్తిడిని తగ్గించుకోవాలి.
- నీరు ఎక్కువగా తాగాలి.
- హాయిగా నిద్రపోవాలి.
మల బద్ధకం ఉంటె ఏం చేయకూడదు
- ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా ఒక్కసారి చూసేద్దాం.
- పాలు, పాల పదార్ధాలు తక్కువగా తీసుకోండి. పన్నీర్, చీజ్ వంటి వాటిని కాస్త అప్పుడప్పుడూ సరదాగా మాత్రమే తీసుకునే ఆహార పదార్ధాల లిస్ట్‌లో చేర్చండి.
- హడావిడిగా పరిగెడుతూ ఏదో ఒకటి తినేసే అలవాటు మీకూ ఉంటే మాత్రం అది తప్పనిసరిగా మార్చుకోవాలి. ఈ ఫుడ్స్ లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఫైబర్ తక్కువగా ఉంటే బవెల్ మూమెంట్ ఫాస్ట్ గా ఉండదు.
- వేపుళ్ళు తగ్గించాలి. వేపుళ్ళు అరిగేటప్పుడు చాలా ఎక్కువ నీరు వాడుకుంటాయి. ఫలితం మలబద్ధకం.
- పేస్ట్రీలు, కప్‌కేక్‌లు నోటికి రుచిగా అద్భుతంగా ఉంటాయి కానీ బాత్రూమ్ లో మాత్రం ఇబ్బంది పెట్టేస్తాయి. వీటిని చాలా లిమిటెడ్ గా తీసుకోండి. వైట్ బ్రెడ్ కూడా ఈ కోవలోకే వస్తుంది.
- కాఫీలానే ఆల్కహాల్ కూడా ఈ సమస్యకి కారణమవుతుంది. నెక్స్ట్ టైం ఆల్కహాల్ తాగుదాం అనుకున్నప్పుడు ముందు రెండు గ్లాసుల మంచి నీరు తాగండి.
గమనిక:
ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.














