ఆంధ్రప్రదేశ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 (AP PGCET 2025) ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) X ఖాతా వేదికగా విడుదల చేశారు. ఏపీపీజీసెట్ లో 88.60 శాతం మంది క్వాలిఫై అయ్యారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 9 నుంచి 12 వరకు జరిగిన ఈ పరీక్షల్లో 25,688 మంది విద్యార్థులు హాజరవగా, 19,488 మంది మాత్రమే ఉత్తీర్ణులు అయ్యారు. ఈ ఫలితాలకు సంబంధించిన మార్కులు, ర్యాంక్ కార్డ్ కోసం https://cets.apsche.ap.gov.in/PGCET/PGCET/PGCET_GetRankCard.aspx వెబ్సైట్ ను సందర్శించాలని సెట్ ఛైర్మన్ డా. అప్పారావు, కన్వీనర్ డా.పీసీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఇక వీటికి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ వచ్చేనెల నుంచి ప్రారంభం కానుంది.














