APSRTC Notification 2025

ఏపీ ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 277 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్‌ 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌‌లో ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. డీజిల్‌ మెకానిక్‌, మోటర్‌ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, పెయింటర్‌, మెషినిస్ట్‌, ఫిట్టర్‌, డ్రాఫ్ట్స్‌ మెన్‌ సివిల్‌ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా నవంబర్‌ 8వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

 

ఖాళీలు..

  • కర్నూలు జిల్లాలో 46
  • నంద్యాల జిల్లాలో 43
  • అనంతపురం జిల్లాలో 50
  • శ్రీ సత్యసాయి జిల్లాలో 34
  • కడప జిల్లాలో 60
  • అన్నమయ్య జిల్లాలో 44 ఉన్నాయి.

 

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదవ తరగతిలో ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐలో సర్టిఫికేట్‌ కూడా తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తు ఫీజు కింద అభ్యర్థులు రూ.118 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్షలేకుండానే విద్యార్హతల్లో సాధించిన మెరిట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా.. అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

 

Apply Now